Tamil Directors: తెలుగు ఆడియన్స్ నాడి పట్టుకోవడంలో తమిళ దర్శకులు ఫెయిల్?
Tamil Directors are Failing to Impress: తమిళ్ డైరెక్టర్లు తెలుగు హీరోలతో పని చేస్తుంటే తెలుగు డైరెక్టర్లు తమిళ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. తెలుగు దర్శకులు తమిళ హీరోలతో హిట్లు కొడుతుంటే తమిళ దర్శకులు మాత్రం హిట్లు అందుకోలేకపోతున్నారు.
Tamil Directors are Failing to Impress Telugu Audiences: ఈ మధ్యకాలంలో దక్షిణాది సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ మొదలైంది. అదేమిటంటే తమిళ్ డైరెక్టర్లు తెలుగు హీరోలతో పని చేస్తుంటే తెలుగు డైరెక్టర్లు తమిళ హీరోలతో పనిచేస్తున్నారు. అయితే తెలుగు దర్శకులు ఎవరైతే తమిళ హీరోలతో సినిమాలు తెరకెక్కిస్తున్నారో అవన్నీ దాదాపుగా హిట్లవుతుంటే తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్న తమిళ దర్శకులు మాత్రం హిట్లు అందుకోలేకపోతున్నారు.
ఎందుకో ఏమో తెలియదు కానీ తెలుగు డైరెక్టర్లు ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ చేస్తున్న సినిమాలతో హిట్లందుకుంటే తమిళనాడులో మాత్రం తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. పంజా మొదలు స్పైడర్ వరకు ఈ మధ్యకాలంలో విడుదలైన వారియర్ సినిమా లాంటివి కూడా మనం పరిశీలిస్తే ఎందుకో వారంతా తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టుకోలేకపోతున్నారు.
Also Read: Chatrapathi Remake: దారుణంగా హిందీ ఛత్రపతి కలెక్షన్స్.. బొక్కబోర్లా పడ్డారుగా!
ఈ మధ్య కాలంలోనే నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో వెంకట్ ప్రభు ఈ సెంటిమెంట్ కి బ్రేకులు వేస్తాడని అనుకుంటే ఆయన కూడా సినిమాకి మిక్స్డ్ టాకు రావడంతో డిజాస్టర్ల లిస్టులో చేరిపోయినట్లుగా అంచనాలు వెలువడుతున్నాయి. ఇక గతంలో వచ్చిన తమిళ డైరెక్టర్లు తెలుగు హీరోల సినిమాల గురించి ఒకసారి పరిశీలిస్తే స్పైడర్ సినిమాలో మహేష్ బాబుని తమిళంలో పరిచయం చేస్తున్నట్టు కంటే ఎస్జె సూర్యని తెలుగులో పరిచయం చేస్తున్నట్లుగా అనిపించింది.
తర్వాత లింగు స్వామి కూడా వారియర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఇటీవల కస్టడీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకట్ ప్రభు మిగతా దర్శకులతో పోలిస్తే పర్వాలేదు అనిపించినా ఆయన మార్క్ సినిమా మాత్రం ఇది కాదని తెలుగు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే తమిళ దర్శకులు ఎవరూ తెలుగు ఆడియన్స్ టేస్ట్ పూర్తిస్థాయిలో క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నారని చెప్పాలి.
Also Read: Actor Naresh on Marriage : 'పవిత్ర'తో పెళ్లి అయిపోయిందా.. నరేష్ అసలు విషయం చెప్పేశాడుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook